తెలంగాణలో కమలం వికసించబోతోందని బిజేపి నేత విజయశాంతి ట్వీట్ చేశారు. 1998ల టైగర్ నరేంద్ర గారు, నేను బీజేపీ నేతలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని మేము తీసుకున్నప్పుడు, అందరూ విమర్శించిన్రు… సాధ్యం కాదు అన్నారని పేర్కొన్నారు.
2014 లో తెలంగాణ సాకారం అయ్యిందన్నారు విజయశాంతి. ఈ రోజు బీజేపీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల ఒక్క సీటు కూడా రాదంటూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాలం నిర్ణయిస్తది.. ధర్మం జయిస్తది.. కమలం వికసిస్తది ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తల పోరాటం మాత్రం అట్లనే ఉంటదన్నారు విజయశాంతి. జై శ్రీరాం.. హర హర మహాదేవ్.. జై తెలంగాణ అంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు విజయశాంతి.