చాలా మంది అబ్బాయిలు ఎంతో స్టైలిష్ గా గడ్డాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. ఒత్తుగా కొంత మంది గడ్డం పెరగదు. కానీ ఇలా కనుక పాటించారంటే గడ్డం ఒత్తుగా పెరుగుతుంది. 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ముఖం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. 20 నుండి 30 ఏళ్ల మధ్య వచ్చే గడ్డం బాగా పల్చగా ఉంటుంది. కానీ 30 తర్వాత మాత్రం బాగా ఒత్తుగా పెరుగుతుంది. టెస్టోస్టెరీన్ హార్మోన్స్ తక్కువగా ఉండడం వలన గడ్డం ఎక్కువ పెరగదు.
అదే విధంగా ఇతర కారణాల వలన కూడా గడ్డం పెరగదు. కండరాలు పెరగకపోవడం, హై కొలెస్ట్రాల్, మానసిక ఇబ్బందులు, అలసట ఇటువంటివి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే గడ్డం బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే కూడా గడ్డం బాగా ఒత్తుగా పెరుగుతుంది.
ఒత్తిడితో బాధపడే వాళ్ళలో గడ్డం రాలిపోతూ ఉంటుంది జుట్టు లానే గడ్డం కూడా ఒత్తిడి వలన రాలిపోతుంది. తగినంత నిద్ర లేకపోవడం వలన గడ్డం సరిగ్గా పెరగదు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా గడ్డం ఒత్తుగా పెరగదు. అబ్బాయిలు ఒత్తుగా గడ్డాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ మార్పులు చేసి చూసుకోండి జీవన విధానంలో ఆరోగ్య విషయంలో ఈ మార్పులు చేసుకుంటే గడ్డం ఈజీగా పెరుగుతుంది.