ఉద్యమకారుడు కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు విజయశాంతి కోరారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్యంపై విజయశాంతి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు.. సర్జరీ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మీరు, ఆరోగ్యంతో నూరేళ్ళు బాగుండాలని కోరారు.

అందుకు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటూనే ఉండాలి…రాజకీయాలు, పార్టీలకతీతంగా…మనం కలిసి తెలంగాణ కై కొట్లాడిన ఉద్యమకారులుగా…మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విజయశాంతి ట్వీట్ చేశారు.
కాగా, ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు యశోద వైద్యులు. ఇక కేసీఆర్ డిశ్చార్జ్ ఐన వెంటనే హైదరాబాద్ నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లారు కేసీఆర్. ఈ మేరకు కేటీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారు.