Lok Sabha Elections : ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్?

-

Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ 16తో ప్రస్తుత లోక్ సభ గడువు ముగియనుండగా, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-మేలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలను మార్చి-ఏప్రిల్ లో ముగించి, మేలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తోందట.

Lok Sabha election schedule in February

దీంతో ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలపై బాంబ్‌ పేల్చారు. రాష్ర్టంలో ముందస్తు రావచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సమావేశమైన సీఎం….ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి మొదటివారంలోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరింత గా కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news