గులాబీ మొక్క ఎండిపోతోందా..? ఇలా చేస్తే సరి..!

-

చాలామంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గులాబీ మొక్కలు గార్డెన్ లో ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. పైగా గులాబీ మొక్కలు ఇంట్లో ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పూలను చూస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది అయితే గులాబీ పూలు పూయకుండా మొక్క ఎక్కువగా ఎండిపోతున్నట్లయితే, ఇలా చేయండి. ఇక ఎండిపోకుండా ఉంటుంది.

 

చిన్న కుండీలలో గులాబీలని ఉంచితే మొక్కలు ఎండిపోతాయి. ఇది పెద్ద కారణం. నేల మీద వేస్తే మంచిది. నేల మీద మీరు మొక్కలు వేయడం వలన పోషక మూలికలు కొరత ఉండదు ఒకవేళ కనుక కుండీలో వేసినట్లయితే కుండీలో మట్టిని మీరు తరచూ మారుస్తూ ఉండాలి. చిన్న కుండీలు నేల కంటే వేడెక్కిపోతాయి. అందుకని ఎండిపోతూ ఉంటాయి. పెద్ద కుండీలలో వేయడం లేదంటే నేల మీద వేయడం మంచిది.

పెద్ద కుండీలలో గులాబీ మొక్కలను నాటి నాణ్యమైన కంపోస్ట్ ని వాడండి అప్పుడు గులాబీ పూలు బాగా పూస్తాయి. మొక్కలు ఎండిపోవు. మొక్కలపై బ్లాక్ స్పాట్ ఫంగస్ కనబడితే తొలగించేయండి లేకపోతే ఎండిపోతుంది. చలికాలంలో విపరీతమైన చలి వలన మొక్కలు చనిపోతూ ఉంటాయి నిజానికి గులాబీ మొక్కల వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి వాతావరణం కనుక వేడిగా ఉంటే వారానికి ఒకసారి గులాబీకి బాగా నీళ్లు పెట్టండి ఇలా మీరు వీటిని కనుక పాటించినట్లయితే గులాబీ మొక్కలు ఎండి బాగా పూలు పూస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news