ప్రతిపక్షాల కూటమి INDIA పై విజయశాంతి సెటైర్లు వేశారు. 26 పార్టీలు బెంగుళూరులో కలిసి, పోరాడుతామన్నప్పుడు, దళిత నేత మల్లిఖార్జున ఖర్గే గారి నేతృత్వమన్నా కనీసం ప్రకటిస్తారన్న అభిప్రాయం కొంత వినపడ్డదంటూ ప్రతి పక్షాల కూటమిపై స్పందించారు విజయశాంతి.
ఐతే, కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాదు, మేమందరం, ప్రధాన మంత్రి అభ్యర్ధులమే అన్న ఉద్దేశం, కాంగ్రెస్ సహా 25 మిగత కాంగ్రెసేతర పార్టీలది కూడా అన్నట్లు సమావేశం జరిగిందంటూ చురకలు అంటించారు. ఏమైనా, గత UPA పేరు తీసివెయ్యటంలోనే , కాంగ్రెస్ నేతృత్వ కూటమి వారిది కాదు అన్న సంకేతం తెలుస్తున్నదన్నారు విజయశాంతి.