కేసీఆర్ గారు చెప్పే బీఆరెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదని విమర్శలు చేశారు విజయశాంతి. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసు. అయితే, టీఆరెస్ ఇక బీఆరెస్ కాబట్టి, పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తాదనే భ్రమతో ప్రాంతేతర పార్టీలు కొన్ని ఈ పరిస్థితిని తమకు అవకాశంగా భావించి తెలంగాణలో పనిచెయ్యటమే కేసీఆర్ గారికి అవసరమన్నారు.
ఈ కొత్త పరిణామాలు మరోసారి తెలంగాణవాద ప్రజా ఓటు బ్యాంకును “మా దశాబ్దాల పోరాట తెలంగాణ పైని మల్లా ఈ ప్రాంతేతర పార్టీల దాడి ఏంది?… ఆక్రమణ ప్రయత్నమేంది?” అనే ఆక్రోశంతో టీఆరెస్ వైపు పెద్ద ఎత్తున మళ్లించడమే సీఎం గారి వ్యూహంగా అర్థం చేసుకుంటే అది వాస్తవ దూరం మాత్రం తప్పకుండా కాదు. ఇప్పటి రోజువారీ సంఘటనలు అందుకు దారి తీసేటట్లుగానే నడుస్తున్నట్లు దశాబ్దాల కాలపు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఎందరో నా తోటి ఉద్యమకారులు తమ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నారని విజయశాంతి పేర్కొన్నారు.