కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు..విజయశాంతి కౌంటర్‌ ట్వీట్‌ ?

-

తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంపై విజయశాంతి స్పందించారు. బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ కు సర్జరీ జరిగి హాస్పిటల్‌ల ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంతమంది బీఆరెస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసం అంటూ ఆగ్రహించారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆరెస్‌కు అవసరమేమో కానీ, కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి కాదని ఫైర్‌ అయ్యారు.

అట్లాంటి ప్రకటనలు చేస్తున్న బీఆరెస్ నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ గారికి ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, మీ కొందరు బీఆరెస్ నేతలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా ఉండదు.. అని చేస్తున్న ప్రకటనలను కూడా మీరు తప్పక తప్పు అని చెప్పాలి కేసీఆర్ గారూ..అంటూ చురకలు అంటించారు విజయశాంతి. మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే.. అన్న ధోరణి విడిచి, తెలంగాణల ప్రజాస్వామ్యం తప్పక పదికాలాలు మంచిగుండాలి.. అని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే…అంటూ విజయశాంతి పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news