తెలంగాణలో యుద్ధం ఆరంభమైంది – ఎంపీ లక్ష్మణ్

-

బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ముఖ్య నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడానికి అనుమతి ఇవ్వడం లేదని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పరిశీలించడం యుద్ధం అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఇక యుద్ధం ఆరంభమైందని.. బీఆర్ఎస్ ని గద్దె దించుతామని అన్నారు. లబ్ధిదారుల జాబితా బయట పడకుండా, ఇళ్లను పరిశీలించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు లక్ష్మణ్. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజలే నిరూపిస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news