నేటి నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు జరుగనున్నాయి. భద్రకాళి ఆలయంలో 15 రోజుల పాటు వైభవంగా సాగనున్నాయి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు. శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
నేడు భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3న ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి మహావైభవోపేతంగా శాకాంబరీ అలంకరణ చేయడంతో ముగుస్తాయి.
నేడు శాకాంబరీ ఉత్సవాల ప్రారంభంలో భాగంగా ఉదయం 10 గంటలకు _భద్రకాళి అమ్మవారికి సహస్ర కళశాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు నీరాజన మంత్రపుష్పములు, తీర్ధప్రసాద వితరణ,సాయంత్రం 7 గంటలకు కామేశ్వరీ నిత్యక్రమం, సాయంతన పూజ ఉంటాయని చెప్పారు. ఈరోజున అమ్మవారిని ఉదయం కాశ్మీక్రమం, సాయంత్రం కామేశ్వరీ క్రమంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.