లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారు: వరంగల్ సీపీ రంగనాథ్‌

-

వరంగల్‌ కేయూలో విద్యార్థుల ఆందోళన ఘటనపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ స్పందించారు. కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక విద్యార్థికి మాత్రమే చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని.. అది కూడా నెల క్రితం జరిగిందని చెప్పారు. పీఎస్‌కు తరలిస్తున్నప్పుడు కమిలిన గాయాలే తప్ప… కొట్టిన దెబ్బలు కావని చెప్పారు. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారని సీపీ ఆరోపించారు. అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా టెస్టులు చేయించవచ్చని తెలిపారు.

‘ప్రశాంత్‌ అనే విద్యార్థికి అయిన ఫ్రాక్చర్‌ నెలక్రితం జరిగింది. మా పోలీసులు ఎవర్నీ కొట్టలేదు. కాకపోతే వారిని అరెస్టు చేస్తున్న సమయంలో తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలై ఉండొచ్చు. అవి కూడా కమిలిన గాయాలే తప్ప కావాలని కొట్టినవి కావు. అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా టెస్టులు చేయించుకోవచ్చు. కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం. విద్యార్థులంటే మా పిల్లల వలే చూసుకుంటాం. కేసులు పెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేసే నిర్ణయం తీసుకోం’ అని సీపీ రంగనాథ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news