గత వారం రోజులుగా యూఎస్ ఓపెన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెన్నిస్ టోర్నమెంట్ లో వరల్డ్ నెంబర్ 2 క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళాడు. నిన్న తొమ్మిదవ సీడ్ ఆటగాడు అమెరికాకు చెందిన ఫ్రిట్జ్ తో క్వార్టర్ ఫైనల్ లో తలపడగా, తన ప్రత్యర్థి నుండి ఎటువంటి సమయంలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. చాలా సునాయాసంగా నోవాక్ జొకోవిచ్ వరుసగా మూడు సెట్ లను గెలుచుకుని సెమిస్ లోకి అడుగుపెట్టాడు. నోవాక్ జొకోవిచ్ ఫ్రిట్జ్ ను 6 – 1 ,6 – 4, 6 – 4 తేడాతో ఓడించాడు. ఇక ఈ విజయంతో నోవాక్ గ్రాండ్ స్లాం టోర్నమెంట్ లలో 47వ సారి సెమిఫైనల్ కు చేరిన ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. కాగా ఇప్పటి వరకు 23 గ్రాండ్ స్లాం లను గెలుచుకుని చరిత్ర సృష్టించిన నోవాక్ జొకోవిచ్ 24వ గ్రాండ్ స్లాం ను గెలుచుకునే దిశగా నడుస్తున్నాడు.
కాగా ఈ యూఎస్ ఓపెన్ లో జొకోవిచ్ కు ఈ ట్రోఫీ ని గెలుచుకోవడం అంత సులభం కాదు.. యువ ఆటగాళ్ల నుండి ఎక్కువ పోటీ ఎదురుకానుంది. ఇక డిపెండింగ్ ఛాంపియన్ కార్లస్ అలకరాజ్ కూడా పోటీలో ఉన్నాడు.