తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్‌ సిటీ సేవలు

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్‌ సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చే దసరా నాటికి పూర్తిచేసి ఉత్తర తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో రూ. 1100 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం మంత్రి పరిశీలించారు. కాలేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని, ఇందులో 35 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని, కిడ్నీ, కాలేయం మార్పిడి వంటి అధునాతన సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పారు. దేశానికి నమూనా ఆరోగ్య నగరంగా ఇది ఉండబోతుందని వెల్లడించారు.