పారిశ్రామిక వేత్తలకు రాయితీలు కల్పిస్తున్నాం : మంత్రి శ్రీధర్ బాబు

-

పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. MSMEలలో ఆధునిక సాంకేతికతకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం.రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈల్లో సాంకేతికతను వాడుకోవాలి. ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు. ఈ పరిశ్రమలకు చెందిన 120 మంది ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు.

హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ విధానం. మన రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారు. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక వసతులతో ప్లాట్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేస్తాం. కొత్తగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సాంప్రదాయ, ప్రత్యామ్నాయం మార్గాలు చూశాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక పురోభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news