రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం : కేసీఆర్ 

-

చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. 15 ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. నాలుగు నెలకే కాంగ్రెస్ కుదేలు అయింది. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ధి చేశాం. కేసీఆర్ రూ.10లక్షలు ఇస్తున్నాడు.. మా ప్రభుత్వం వస్తే.. రూ.12 లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవన్నీ మాయమయ్యాయి.

తాము కళ్యాణ లక్ష్మీ ఇస్తే.. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి.. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. ఇప్పుడు తులం బంగారం కొందామంటే ప్రభుత్వానికి దొరకడం లేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news