అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి

-

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నిర్మల్ లో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క గ్యారంటీ కూడా న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వదలిపెట్టబోమని.. అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్ అంటున్నారు.. ఒకసారి ఆర్టీసీ బస్సు ఎక్కి చూస్తే తెలుస్తుంది.. హామీలు అమలు అవుతున్నాయో లేదో అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేవంత్ విమర్శించారు.

విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే.. గాడిద గుడ్డు చేతిలో పెట్టిందని వ్యాఖ్యానించారు. అలాంటి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని.. దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని రేవంత్ చెప్పారు. మే 9వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీనాటికి ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news