మహిళలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ కీలక హామీ

-

ఈ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా, ఎన్డీఏ కూటములకు మధ్య జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని పరిరక్షించే ఇండియా కూటమి ఉంది. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ఎన్డీఏ కూటమి ఉందని అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగాన్ని మార్చడమే గాకుండా.. రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు. పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజల పక్షాన ఆలోచించి పనిచేస్తుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి గ్రాడ్యూయేటు ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కులగణన, ఆర్థిక సర్వే చేస్తామని చెప్పారు. సంపన్న వర్గాల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news