కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వర్షాలు అధిక శాతంలో పడకపోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీఅర్ఎస్, బీజేపీ ప్రభుత్వం మాటల వరకే పరిమి తం తప్పా ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందిస్తుందన్నా రు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం. ఆ తర్వాతే ఎన్నికలకు పోతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ సీట్లు గెలవడం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు.