బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభిస్తాం : శ్రీధర్ బాబు

-

బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమ ప్రారంభం, చెరకు సాగు ఒకేసారి జరగాలి అన్నారు. కొత్త వంగడాల కోసం వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతో చెరుకు రైతులు నష్టపోయారని తెలిపారు. రైతులకు పర్చేస్ ట్యాక్స్ సబ్సీడీని పరిశీలిస్తున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి శ్రీదర్ బాబు.

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడి దాాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. దీనిపై ఆధారపడిన కార్మికులకు జీవనోపాధి కరువు అయింది. ఈ ఫ్యాక్టరీ చాలా కాలం పాటు బాగానే నడిచింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో దీనిని ప్రైవేటీకరించారు. అప్పటి నుంచి నష్టాలు రావడం ప్రారంభం అయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనిపై ఓ కమిటీని కూడా వేశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. కాలక్రమేణా 2015లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది.

Read more RELATED
Recommended to you

Latest news