రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడినప్పటికీ చార్జీలను పెంచుతున్నామని తెలిపారు. అందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 3 నుంచి 7 వరకు విద్యార్థుల డైట్ చార్జీల్లో మార్పులు ప్రస్తుత రేట్ ప్రస్తుత రేటు 950 సవరించిన రూ.1330 అని తెలిపారు. 8 నుంచి 10 వరకు డైట్ చార్జీలను రూ.440 పెంచామని.. ప్రస్తుత రేట్ రూ.1100, సవరించిన రేటు రూ.1540. అలాగే ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.2100 వరకు డైట్ చార్జీలను పెంచినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరకంగా డైట్ చార్జీలు ఇవ్వాలని నిర్జయించినట్టు తెలిపారు భట్టి విక్రమార్క. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 55వేల ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వల్ల గురుకుల విద్యార్థులు బాధపడుతున్నారని పేర్కొన్నారు.