కవితకి బెయిల్ వస్తే బీజేపీకి లింకేంటి..? – రఘునందన్ రావు

-

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం లో కవిత 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు ఆమె మెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించినా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ గవాయ్, విశ్వనాథ్ లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే కవిత బెయిల్ పైకి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బెయిల్ కోసం బీఆర్ఎస్ నాయకులు బిజెపితో లాలూచీపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా బిజెపి ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద నమ్మకం లేదని, రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత బెయిల్ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కేసులో అయినా ఓ వ్యక్తి బెయిల్ పొందడం చాలా సాధారణ విషయం అని.. కవితకు బెయిల్ వస్తే బిజెపికి లింక్ ఏంటని ప్రశ్నించారు రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news