తెలంగాణాలో మద్యం ఎప్పుడు అంటే…!

-

కేంద్ర ప్రభుత్వ కొత్త ఆదేశాలతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా మద్యం అమ్మకాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాయి. అయితే తెలంగాణ సర్కార్ మద్యం అమ్మకాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. తెలంగాణాలో మార్చ్ 22 తర్వాత మద్యం అమ్మకాలు లేవు.

దీనితో రోజు వందల కోట్ల ఆదాయం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మద్యం అమ్మకాల నిలిపివేతతో ప్రభుత్వానికి నెలకు 2000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, బేవెరేజెస్, డిస్టలరికు 500 కోట్ల నష్టం వస్తోందని అంచనా వేసారు. ఇక అక్కడ మద్యం తయారి కూడా పూర్తిగా ఆపేసారు. బీర్ల ఉత్పత్తికి కేసీఆర్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. దీనితో ఆరు బేవరేజెస్‌లో ఇవాళ్టి నుంచి బీర్ల తయారీ ప్రారంభం కానుంది. లాక్ డౌన్ తెలంగాణాలో మే 7 వరకు అమలు అవుతుంది. కేంద్రం మార్గదర్శకాలను అమలు చేస్తారా లేదా అనే దాని మీద స్పష్టత లేదు.

రేపు రాష్ట్ర కేబినేట్ సమావేశం అవుతుంది. ఇందులో మద్యం అమ్మకాల మీద ఒక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే బేవరేజెస్‌లో సుమారు మూడు లక్షల బీర్ల కేసులు స్టాక్ ఉండగా… వైన్ షాపుల్లో మరో నాలుగు లక్షల బీర్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు వేసవి కావడంతో చాలా మంది బీర్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. వేరే మద్యం తాగితే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని బీరు అయితే ఆ గోల ఉండదు అని భావిస్తున్నారు. రేపటి కేబినేట్ సమావేశంలో మద్యంపై నిర్ణయం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news