నాటి ఉద్యమకారుడు కేసీఆర్ ఎక్కడ ? : స్వామి గౌడ్

-

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గర బండి సంజయ్ పాదయాత్ర విరామ సమయంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ…పాదయాత్రలో ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ వచ్చిందని సంతోషిస్తున్నారు అని అన్నారు.ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదు అని విమర్శించారు.

గ్రామంలోని యువకులు నిరుద్యోగ సమస్య కారణంగా.. పశువుల కన్నా అద్వాన్నంగా బతుకుతున్నాము అని వాపోతున్నారు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు… ఆర్డియెస్ కొరకు పాటు పడతామని చెప్పిన ఆ నాటి ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పడు ఏక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు.ఈ నాటికి ఆర్డీఎస్ ను పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు స్వామి గౌడ్.పాదయాత్రలో రైతు బంధు గురించి రైతులను అడిగితే.. ఉన్నోడికే రైతు బంధు అని చెపుతున్నారు.

కొంతమంది ఓర్వలేక బీజేపీ యాత్రను తొండి యాత్ర అంటున్నాడు.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భాజపా పార్టీ గ్రామస్థాయిలోకి వెళ్తుంది అని అన్నారు.తెరాస ప్రభుత్వం బీజేపీ పార్టీ ని తీరగనివ్వనియం.. అన్న చోట కూడా భాజపా ప్రజల లోకి వెళ్తుంది..బండి సంజయ్ చేస్తున్న పాద యాత్ర ను ఓర్వలేక మా పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు..మీరు మా పై రాళ్ల తో దాడి చేసిన మేము ప్రజా సమస్యల కొరకు రాళ్ల దాడి నైనా భరించి.. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తాం అన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మాట్లాడుతూ.. కెసిఆర్ గారు నీ పదవిని నిన్ను అరచేతిలో పెట్టుకోవడానికె.. ఒక పెళ్లిలో ఉన్న నిన్ను హత్య ప్రయత్నం చేయించినట్లు డ్రామాలు ఆడి కేసులు పెట్టించాడు అని అన్నారు స్వామి గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news