కామారెడ్డి రైతుల భూములు కొల్లగొట్టేందుకే ఇక్కడ కేసీఆర్ పోటీ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కామారెడ్డిలో చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మి కేసీఆర్ కి ఓటు వేస్తే.. పామును పెంచి పోషించినట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల బతుకులు బాగుపడుతాయి.
భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి రూ.12వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. పేదోళ్లందరికీ ఇంటి దగ్గర ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చె నెల నుంచి కరెంట్ బిల్లు కట్టాల్సిన పనే లేదు. అదేవిధంగా పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ పదేళ్లలో డబుల్ బెడ్ రూం, రేషన్ కార్డులు ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కే పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 70కి పైగా సీట్లు గెలవబోతున్నామని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోష్యం చెప్పారు.