బీజేపీ తరఫున తెలంగాణ నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించారు. దీంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో రాష్ట్ర ఆశలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి సహా నలుగురు ఎంపీ అభ్యర్థులు గెలుపొందినా.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జి.కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో కిషన్‌రె డ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి విజయం సాధించారు.
అయితే ఆయనతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్ ), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి) , కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ (మహబూబ్‌నగర్) గెలుపొందారు. వీరంతా తెలంగాణకు సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. దీంతో వీరిలో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎనిమిది మందిలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి అధినాయకత్వం ఎవరి పట్ల మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సిందే.