ఇంతలా భయపెట్టి ఏం సాధిస్తారు : జగత్‌ విఖ్యాత్

Join Our COmmunity

తమ కుటుంబాన్ని ఇంతలా భయపెట్టి ఏం సాధిస్తారని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి అన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్టయిన నేపథ్యంలో ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, అఖిలప్రియ ఆరోగ్యం బాగా లేదని చెప్పిన ఏమాత్రం కనికరం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అస్సలు ఈ కేసుకు, మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకున్నా అనవసరంగా అఖిలప్రియను అరెస్టు చేశారన్నారు. రాజకీయ లబ్ధికోసం తమను ఇంతాలా భయపెట్టి ఏం సాధిస్తారిన జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు.

 

హఫీజ్‌పేట్‌ భూములకు అసలైన హక్కుదారులం మేమే. ఆ భూములపై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతుంది. మా సొంత భూముల విషయంలో మమ్మల్నే ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మకయ్యారు. మా నాన్న మరణాంతరం నానా అడ్డుంకులు ఎదుర్కున్నాం. వాటిని ఎదుర్కుంటూ ముందుకెళ్తున్నాం. ఆ భూ వివాదం వెంట పెద్ద తలకాయలు ఉన్నావి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి మాకు న్యాయం చేయాలి. అస్సలు భూ వివాదం వెనక ఏమి జరుగుతుందో ఒక్కసారి తెలసుకోవాలని మీడియా ముఖంగా అఖియప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ కోరారు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news