జమ్మికుంట బీజేపీ జనజర్జన సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. తెలంగాణలో అభి ద్ధి ఎందుకు జరగడం లేదు. తెలంగాణ అభివృద్ది కొద్ది మందికి. ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైంది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఆ రాస్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంటే.. తెలంగాణలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ అధికారం లేకుంటే ఉంలేరు. తెలంగాణలో కుటుంబ అభివృద్ది మాత్రమే జరుతుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమైంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈటల రాజేందర్ గారికి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంతా చేసినా ఈటల రాజేందర్ గెలవడం అభినందనీయమన్నారు. 2024లో అయోద్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కాబోతుందని తెలిాపారు. బీజేపీ ఏమాట చెప్పినా అది నెరవేరుస్తుంది. జమ్మూ-కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసింది. మాట ఇస్తే ఆ మాల ప్రకారమే బీజేపీ నడుచుకుంటుంది. ధరణీ అవినీతికి మారుపేరు అయింది.