రాజ్ భవన్ లో జరిగిన మహిళా దర్బార్ పై టిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాదర్బార్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. “గవర్నర్ గా ఉండి మా గెలుపు ఖాయం, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటున్నారు.. గవర్నర్ రాజకీయ పార్టీ నేతనా?” అంటూ నిలదీశారు. మధ్యప్రదేశ్ లో రేపులు జరిగాయి అక్కడ అవసరం మహిళా దర్బార్లు అంటూ వ్యాఖ్యలు చేశారు.
రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మహిళా దర్బారు నిర్వహించారన్నారు. ప్రజా దర్బార్ కాదు బీజేపీ దర్బార్ అని విమర్శించారు. ఈడి, సిబిఐ, ఐటిలతో ప్రశ్నించే పార్టీల నేతలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ మూడే కాదు నాలుగో వ్యవస్థగా గవర్నర్ వ్యవస్థను ప్రధాని మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు.