చంద్రబాబు నాసిరకం నాయకుడు..అందితే జుట్టు…అందకపోతే కాళ్లు – విజయసాయి

-

చంద్రబాబు నాసిరకం నాయకుడు..అందితే జుట్టు…అందకపోతే కాళ్లు అంటూ ఓ రేంజ్ విజయసాయి రెడ్డి సెటైర్‌ వేశారు. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు(నారా) నాయుడు బాబు.

అందితే జుట్టు…అందకపోతే కాళ్లు – ఈ అవకాశవాది దినచర్య అంటూ చురకలు అంటించారు విజయసాయి. మంగళగిరిలో ఏం ఖర్మ, నీవు దోచుకున్న లక్షల కోట్లతో 100 ఏళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు దొంగ బాబూ అని ఫైర్‌ అయ్యారు. పదేళ్లపాటు ఫ్రీగా భోజనాలు పెట్టినా నీ సంపద ఉల్లి పొట్టంత కూడా తరగదు. 2 ఎకరాల నుంచి 5 లక్షల కోట్లు ఎలా సంపాదించావో జాతీయ మీడియా ఎప్పుడో ఆధారాలతో సహా రాసిందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news