బరాత్‌లో డాన్స్ చేయొద్దని భార్య చెప్పాడంతో… ఆవేశంలో భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు.

పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని భార్య.. అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ కాస్త మతి స్థిమితం లేదని చెబుతున్నారు.