కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు తాజాగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్ షా లతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. కేంద్ర బిజెపి నాయకత్వం నుంచి ఆఫర్ రావడంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని, దీనిపై చర్చించేందుకు ఇవ్వాళ నియోజకవర్గంలో ఓ సమావేశం కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.తానుఅమిత్‌షాని కలిసిన మాట వాస్తవమేనని,కానీ పార్టీ మార్పుపై గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని, కేసీఆర్‌ని ఓడించే బిజెపి పార్టీలోకి వెళ్తానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.