రేవంత్ రెడ్డి తెలంగాణ బడ్జెట్ అంత పెట్టి ఒలింపిక్స్ నిర్వహిస్తాడా..? : కేటీఆర్

-

ఒలింపిక్స్ నిర్వహించాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంత అవుద్ది.. F1కి 50కోట్లు పెడితేనే అరుస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ బడ్జెట్ అంత పెట్టి ఒలింపిక్స్ నిర్వహిస్తాడా..? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఫార్ములా ఈ రేస్ పై తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016లో రియోలో ఒలంపిక్స్ జరిగితే.. అక్కడ ప్రభుత్వం పెట్టిన 1లక్ష8వేల కోట్లు. 2020లో టోక్యో ఒలంపిక్స్ లో 2.9 లక్షల కోట్లు.. అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ. ఈ మొగోడు ఒలంపిక్స్ హైదరాబాద్ లో పెడతాడంట అంటూ రేవంత్ రెడ్డి పై  సెటైర్లు వేశారు కేటీఆర్.

ఫార్ములా ఈ రేస్ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే.. హైదరాబాద్ ఈకో సిస్టమ్ కు రూ.700 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. ఇవి తాను చెబుతున్న మాటలు కాదని.. నెల్సన్ అనే స్వతంత్ర సంస్థ ఇచ్చిన రిపోర్టు అని తెలిపారు. ప్రైవేట్ కంపెనీ రూ.100 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం రూ.35 కోట్లు నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news