దేశ వ్యాప్తంగా ఉచిత విద్య వైద్యం ఇస్తే మ‌ద్ద‌తు ఇస్తాం : బీజేపీకి కేటీఆర్ స‌వాల్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ చేస్తున్న పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల్సిన ఖ‌ర్మ త‌మ పార్టీకి లేద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయ‌న పాద‌యాత్ర ఎందుకు చేస్తుండో ప్రజ‌లు చెప్పాల్సిన అవ‌సరం ఉంద‌ని అన్నారు. పాల‌మూరు జిల్లాలో పాద‌యాత్ర ఏ మొహం పెట్టుకుని చేస్తున్నాడ‌ని విమ‌ర్శించాడు. పాల‌మూరి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయ హోదా ఇవ్వ‌లేని పార్టీ నాయ‌కుడు.. పాద‌యాత్ర చేస్తే.. ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తే.. ఉచితంగా వైద్యం, విద్య అన్న‌ బండి సంజ‌య్.. మ‌రి దేశంలో బీజేపీ నే అధికారంలో ఉందని అన్నారు.

దేశ వ్యాప్తంగా ఉచిత వైద్యం, విద్య ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కార్ దేశ వ్యాప్తంగా ఫ్రీగా వైద్యం విద్య ఇస్తే.. తామే మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని స‌వాల్ విసిరారు. తెలంగాణ లో తమ పాల‌నపై విమ‌ర్శ‌లు చేసే ముందు.. ప‌క్క రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో బీజేపీ పాల‌న ఎలా ఉందో తెలుసుకోవాల‌ని అన్నారు. అవ‌స‌రం అయితే.. ఏసీ కార్లు ఇచ్చి పంపిస్తామ‌ని అన్నారు. అక్క‌డ 40 మంది మంత్రులు అవినీతిలో చిక్కుకున్నార‌ని ఆరోపించారు. క‌మీషన్లు తింటూ రాష్ట్రాన్ని నాశానం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version