Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’లో ఎంటర్‌టైన్మెంట్‌ను మించిన లెక్కలు..పవన్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్

-

జనసేనాని పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదలైన సక్సెస్ అయింది. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ ఫిల్మ్ చేయనున్నారు.

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీశ్ కాంబోలో వస్తున్న పిక్చర్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే, ఈ సారి పవన్ కల్యాణ్ ను వెరీ డిఫరెంట్ ఇమేజ్ లో హరీశ్ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. అందుకే ‘దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్’ అనే క్యాప్షన్ ను హరీశ్ శంకర్ పోస్టర్ లో రివీల్ చేశారని అభిమానులు అంటున్నారు.

కమర్షియల్ ఫార్ములాతో పాటు సొసైటీకి మంచి సందేశం ఇచ్చేలా సినిమా స్టోరిని హరీశ్ శంకర్ రచించినట్లు టాక్. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారని తెలుస్తుండగా, ఇందులో ఇంకో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని వినికిడి.

సినిమా స్టోరిలో భాగంగా కొత్త వారిని పరిచయం చేయాలని దర్శకులు భావిస్తున్నారట. ముగ్గుర హీరోయిన్స్ తో ఓ పాట ప్లాన్ చేసి, అందులో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ పెట్టి..దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ రచ్చ చేయాలని అనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో లెక్చరర్ రోల్ తో పాటు ఇంకో పాత్రను కూడా పోషిస్తారని అభిమానులు అంటున్నారు. చూడాలి మరి.. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల హరీ శ్ శంకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version