HYD: రేపు హైదరాబాద్‌లో వైన్స్ బంద్

-

మందుబాబులకు బిగ్‌ షాక్‌. రేపు హైదరాబాద్‌లో వైన్స్ బంద్ కానున్నాయి. శ్రీ రామ నవమి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

Wines bandh in Hyderabad tomorrow

రేపు ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్, కల్లు, దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు సైతం బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news