డైలీహంట్ ‘ట్రస్ట్ ఆఫ్ నేషన్’ సర్వేలో 64% మంది.. మళ్ళీ మోడీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు..!

-

డైలీ హంట్ ప్లాట్ఫారం గురించి అందరికీ తెలుసు.  డైలీ హంట్ లోకల్ లాంగ్వేజ్ కంటెంట్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్ చేసిన సర్వే లో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ”ట్రస్ట్ ఆఫ్ నేషన్ 2024 సర్వే” ద్వారా కొన్ని విషయాలు వెల్లడించారు. 11 భాషల్లో ఇంగ్లీష్, హిందీ తో సహా పలు భాషల్లో 77 లక్షల మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల యొక్క ఆలోచనని అర్థం చేసుకోవడానికి ఈ సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం పరిపాలన విధానం బాగుందని 61 శాతం మంది నమ్ముతున్నట్టు ఈ సర్వే చెప్తోంది.

నరేంద్ర మోడీ పరిపాలన తీరుపై సగానికి పైగా మంది మద్దతు ఇవ్వడం విశేషం. బిజెపి లేదా ఎన్డిఏ కి మద్దతు ఇచ్చారు 63 శాతం మంది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ప్రధాన నరేంద్ర మోడీ పరిపాలన బాగున్నట్లు వెల్లడించారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరూ రానున్న ఎలక్షన్లలో బిజెపి లేదా ఎన్డిఏ గెలుస్తుందని ఓటు వేశారు. ఢిల్లీలో చూసుకున్నట్లయితే మోడీకి 57.7%, రాహుల్ గాంధీకి 24.2 శాతం, యోగి ఆదిత్యనాథ్ కి 13.7 శాతం ఓట్లు వస్తాయని సర్వ్ లో తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ 78.2% ఓట్లతో అగ్రగామిగా నిలిచారు. రాహుల్ గాంధీకి 10% ఓట్లు వచ్చాయి. అలానే పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ 62.6%, రాహుల్ గాంధీకి 19.6% ఓట్లు, మమతా బెనర్జీకి 14.8% ఓట్లు వస్తాయని సర్వే చెప్తోంది. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీకి 60.1% ఓట్లు, రాహుల్ గాంధీ 26.5%. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీకి 71.8 శాతం ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ కి 17.9%, చంద్రబాబు నాయుడు 7.4% ఓట్లు వస్తాయని సర్వే చెప్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news