హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలలో రేపు వైన్స్‌ బంద్‌

-

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర వాసులకు అలర్ట్‌. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో వైన్స్‌ షాప్స్‌ క్లోజ్‌ కానున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేత వేయాలని ఆదేశాలు ఇచ్చారు హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. 4.6.2024 ఉదయము 6 గంటలనుండి 5.6.2024 ఉదయం 6 గంటల వరకు వైన్స్‌ మూసివేయాలని పేర్కొన్నారు హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలలో రేపు వైన్స్‌ బంద్‌

జంట నగరాలలో ఉన్న 16 కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు, 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో ఏటాంటి బాణాసంచాలను కాల్చడము కాని, విసిరేయడము నిషేధం అని ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్‌ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news