ఫిట్‌గా మారిన బాలీవుడ్ హీరోయిన్.. ఆమె చెప్పిన సీక్రెట్ ఫార్ములా ఇదే

-

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తొలి చిత్రం దమ్ లాగేకే హైష మూవీ కోసం బరువు పెరిగారు ఆ తర్వాత కేవలం నాలుగు నెలల్లో 32 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. 89 కిలోల నుండి 57 కిలోలకు చేరుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తాజాగా ఆమె తన ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి తన ఫిట్నెస్ రహస్యాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం..

ఈ రోజుల్లో ఎంతోమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులను చేసుకుంటే కొందరు ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.మరికొందరు మరెన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ బరువు తగ్గి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె బరువు తగ్గించుకోవడంలో చెప్పిన రహస్యాలు ఇప్పుడు చూద్దాం..

From Flab to Fit Bhumi Pednekar’s Weight Loss Formula

భూమి తన బరువు తగ్గించే ప్రయాణంలో ఆహారం ప్రధాన పాత్ర వహించింది అని చెప్పచ్చు ఆమె డైట్ ప్లాన్లకు బదులుగా, సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకుంది. కొద్దికొద్దిగా భోజనం తినడం లేదంటే పూర్తిగా భోజనం మానేయడం ఇవి రెండూ చేయకుండా ఆమె ఒక ప్రణాళిక ప్రకారం ఆహారాన్ని తీసుకోవడం అది కూడా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆహారం ఎప్పుడూ మనకి శత్రువు కాదు అని సరైన టైంలో భోజనం చేయడం ఫుడ్ ని కంట్రోల్ గా తినడం, ఇంట్లో వండిన పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని ఆమె తెలిపింది. ఆమె తినె ఆహారంలో ప్రోటీన్లు, సబ్జా, రోటీలు,పండ్లు ఆహారంలో భాగంగా చేసుకుంది.

అల్పాహారం మిస్ చేయకుండా ప్రతిరోజు టైం కు ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం తాజా పండ్లు కొంచెం గంజి, గుప్పెడు నానబెట్టిన బాదంపప్పులను అల్పాహారంగా తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ప్రతిరోజు ఒక టైం కు వ్యాయామం చేయడం, ఎక్కువ దూరం నడవడం వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం డాన్స్ సంబంధించిన ఎక్సర్సైజులను ఆమె రొటీన్ వ్యాయామంలో భాగంగా చేసుకున్నారు.

ఆమె తన తొలి సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చినప్పటికీ ఆమె అభిమానులు మద్దతుతో, మానసిక శారీరక స్ట్రాంగ్ గా తయారవ్వాలని ఒత్తిడిని తగ్గించి క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని చేదించింది. ఈమె 2020లో మాంసాహారాన్ని వదిలేసి శాఖాహార ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం మొదలుపెట్టింది. ఆమె ఫిట్నెస్ కు సంబంధించిన రహస్యాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా తన వర్కౌట్ వీడియోలను ఆహార చిట్కాలను షేర్ చేస్తూ, అభిమానులలో స్ఫూర్తిని కలిగించింది. నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన పద్ధతుల్ని అవలంబిస్తూ ఆహారాన్ని తీసుకుంటూ 30 కిలోలకు పైగా బరువు తగ్గడం అనేది అభినందించాల్సిన విషయం ఆమె ఎంతో మందికి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచింది అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news