రేవంత్ రెడ్డి వల్లే ఈరోజు భూకంపం వచ్చింది : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

-

నేను బంజారాహిల్స్ పీఎస్ వస్తానని ఉదయమే ఏసీపీకి చెప్పాను. నేను 3 గంటలకు వస్తాను అంటే..ఏసీపీ బయటకు వెళ్లి పోయాడు. సీఐ పారిపోయే ప్రయత్నం చేశారు అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. ఒక ఎమ్మెల్యే వస్తే సీఐ రిసీవ్ చేసుకోవాలి అని చట్టం ఉంది. వార్డ్ మెంబెర్ కు గెలవని సీఎం సోదరులకు సలాం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కు గౌరవం ఇవ్వట్లేదు. మళ్ళీ BRS ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అని చెప్పాము. నా ఫోను ట్యాపింగ్ జరుగుతుంది అని కంప్లైంట్ ఇచ్చాను. నా ఫోన్ ను సీఎం రేవంత్ రెడ్డి, శివదర్ రెడ్డి లు ట్యాపింగ్ చేస్తున్నారు. వారిపై వెంటనే కేస్ లు బుక్ చేయాలి అన్నారు.

ఇక రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద దొంగ ఒట్లు వేశాడు. అందుకే ఈరోజు భూకంపం వచ్చింది అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాపం చేశాడు అని దేవుళ్ల కు కోపం వచ్చింది. అందుకే ఇలాంటి భూకంపాలు వస్తున్నాయి. కరీంనగర్ సీపీ ఫోను కూడా ట్యాపింగ్ చేశారు. అలాగే నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. చక్రధర్ గౌడ్ అనే బ్రోకర్ కంప్లైంట్ చేస్తే హరీష్ రావు మీద కేస్ బుక్ చేశారు. ఒక ఎమ్మెల్యే ను.. నేను చెప్పినా కేస్ ఎందుకు బుక్ చేయట్లేదు అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news