BREAKING : ఐటీ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ !

-

ఐటీ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు శుక్రవారం మరియు శనివారం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అనుమతించాలని అన్ని IT & ITES కంపెనీలకు ఆదేశించారు సీఎం కేసీఆర్.

భారీ వర్షాల కారణంగా శనివారం వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news