గతంలో యాదగిరి గుట్టగా ఉన్న పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యాదాద్రి పేరును మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రికి బదులు యాదగిరి గుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇక పై రికార్డులలో కూడా ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పై జరిగిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ అధికారులతో ముగిసింది సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష. స్వర్ణ తాపడ పనుల పురోగతి, ఆలయ అభివృద్ధి, పెండింగ్ పనులపై చర్చ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు.. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ.. యాదాద్రికి బదులుగా.. యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని.. అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా పేరు మార్పు చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసారు.