ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి గా అభివృద్ధికి జిఓ జారీ చేసింది ప్రభుత్వం. మొత్తం 73 అదనపు ఉద్యోగాలను కూడా కల్పిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 52.2 కోట్ల ఖర్చుతో అదనపు పడకలను, అదనపు ఉద్యోగాలను అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ 30 పడకల ఆసుపత్రిగా ఉన్న మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి.. ఇక నుంచి 100 పడకల ఆసుపత్రిగా మారింది.
కేవలం మంగళగిరి ఆసుపత్రి మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ప్రతీ ఒక్కరికీ రూ.25లక్షల వైద్య సాయం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రబుత్వం పెట్టిన 2వేల కోట్ల బకాయిలు మా ప్రబుత్వం తీర్చిందని మంత్రి తెలిపారు.