నేటితో ముగియనున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

-

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం అర్చకులు శృంగార డోలోత్సవంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు. ఈ ఉత్సవాల్లో పదో రోజైన బుధవారం రాత్రి వైభవంగా స్వామి వారికి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించారు. లక్ష్మీ సమేత నరసింహ స్వామికి వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు.

లోక సంరక్షణ సంక్షేమం కోసం కొనసాగిన యాదాద్రీషుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముల్లోకాధిపతులు, దేవతలు బుధవారం రాత్రి వేళ మళ్లీ వస్తామంటూ తమ లోకాలకు తిరుగు పయనమయ్యారు. ఉత్సవ చివరి అంకంలో చేపట్టిన దేవతోద్వాసన పర్వంతో దేవతలకు ఇష్టమైన రాగాల పానాల మధ్య బేరి పూజతో అర్చకులు వీడ్కోలు పలికారు. ఉత్సవాలు  నేడు ముగుస్తున్నందున అష్టోత్త శత ఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news