జూ పార్క్ లో యువకుడి హల్చల్

హైద‌రాబాద్ లోని జూ పార్క్ లో ఒక యువ‌కుడు హల్చల్ సృష్టించాడు. జూ పార్క్ కు అని వెళ్లిన యువ‌కుడు కొద్ది సేపు జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది ని ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఆ యువ‌కుడు ఏకంగా సింహం ద‌గ్గ‌ర కి దూసుకూ పోవ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. సింహం ఉండే ఎన్ క్లోజర్ లోకి దూకి సింహం వ‌ద్ద కు వెళ్ల‌డానికి ప్రయత్నించాడు.

అయితే యువకుడు చేస్తున్న‌ ఆగడాలను జూ పార్క్ సిబ్బంది గుర్తించారు. అప్ప‌టి కే ఆ యువ‌కుడు ఎన్ క్లోజర్ పైకి ఎక్క‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దీంతో జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది వ‌చ్చి యువ‌కుడిని సింహం చుట్టు ఉండే ఎన్ క్లోజర్ దూక కుండా అడ్డు కున్నారు. అయితే యువ‌కుడు ఎన్ క్లోజ‌ర్ దూకుతుండ గా లోప‌ల ఉన్న సింహం ఆ యువ‌కున్ని ప‌ట్టు కునేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే స‌మ‌యానికి జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది రావ‌డం తో సింహానికి ఆహారం దూరం అయింది దీంతో సింహం ఆశ గా యువ‌కుడి వైపు చూసింది.