HYD: హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై దాడి జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో వాటర్, కరెంట్ కోతలతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పాలన రాగానే.. నీటి సమస్య హైదరాబాద్ లో విపరీతంగా పెరిగింది. అయితే… తాజాగా హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లోని ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.