PM MODI: చూపు లేని యువతితో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో రాణీప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈసీని అభినందించారు. అయితే.. ఇక్కడే తన ఎస్పీజీ సిబ్బందిపై మోదీ గుస్సా అయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్‌లో ఓటింగ్‌లో పాల్గొన్న తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ చూపు లేని యువతి దగ్గరకు వెళ్లి మాట్లాడారు మోదీ. యువతి మాట్లాడుతున్న సమయంలో వచ్చిన భద్రతా సిబ్బందిని దూరం వెళ్ళాలని సూచించారు మోదీ.