నా కొడుకు పెళ్లికి చంద్రబాబు వస్తాడు – వైఎస్ షర్మిల

-

నా కొడుకు పెళ్లికి చంద్రబాబు వస్తాడని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించానని…. వస్తానని ఆయన మాట ఇచ్చారని YS షర్మిల వెల్లడించారు. ‘నా తండ్రి YSRతో ఉన్న అనుబంధాన్ని CBN గుర్తు చేసుకున్నారు.

ys sharmila met chandrababu naidu
ys sharmila met chandrababu naidu

క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లకు స్వీట్లు పంపా. ప్రతి విషయాన్ని రాజకీయాలకు ముడి పెట్టవద్దు. కేటీఆర్, కవిత, హరీష్ రావులకు కూడా స్వీట్లు పంపా. రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణము ఉండాలి’ అని ఆమె ఆకాంక్షించారు.

చంద్రబాబు.. వైఎస్సార్‌ గురించి చెప్పారు.. ఆయనతో ఉన్న పరిచయాలు పంచుకున్నారన్నారు. కాంగ్రెస్ ఏ పదవి ఇవ్వాలి అనేది ఆ పార్టీ నిర్ణయం.. రాహుల్ ప్రధాని అయితేనే మంచి జరుగుతుందని వెల్లడించారు. వైఎస్సార్‌ది కూడా అదే ఆలోచన.. రాజకీయాలు మా ప్రొఫెషన్.. జీవితాలు కాదని వివరించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news