అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో ఒకటైన సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం తెలుగు పండుగలు నిర్వహించడంలో, తెలుగువారికి స్థానికంగా అండగా ఉండటంలో కీలకంగా పనిచేస్తుంది. అలాగే తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని కాపాడటంలోనూ ఒహియో తెలుగు సంఘం ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో రానున్న అతిపెద్ద తెలుగుపండుగ సంక్రాంతి పండుగని ఎంతో వైభంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జనవరి 11 తేదీన సంక్రాంతిని పురస్కరించుకుని నార్త్ వెస్ట్ చాపెల్ లో గ్రేస్ బ్రెత్రేన్ లో సంక్రాంతి వేడుకలు నిర్వహించనుంది. సంక్రాంతి పండుగకి శోభని ఇచ్చే ముగ్గులని ఈ వేడుకలో పోటీలుగా పెట్టింది. అలాగే గాలిపటాల పోటీలు, కోలాటం ఇలాంటి ఎన్నో పోటీలని పిల్లు పెద్దలకోసం ఏర్పాటు చేసింది.
ముగ్గుల పోటీలకి చిన్నా పెద్దా అందరూ పాల్గొన వచ్చునని, గాలిపటాల పోటీలలో కేవలం 15 ఏళ్ళ లోపు పిల్లలు మాత్రమే పాల్గొనాలని అలాగే కోలాటం ఆడేవారు ఆరుగురు సభ్యులు కలిసి ఒక గ్రూప్ గా పేర్లు నమోదు చేయించుకోవాలని ప్రకటించింది. అంతేకాదు పోటీలలో పాల్గొనే వారికి పోటీలకి తగ్గట్టుగా ప్రవేశ రుసుము కూడా కట్టాలని వేడుకల కోసం విడుదల చేసిన బ్రోచర్ లో పేర్కొంది.