తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..

-

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌లువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక త‌మ తొలి వైవాహిక బంధానికి దూర‌మై మ‌ళ్లీ పెళ్లి చేసుకుని కొత్త వైవాహిక బంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు ఎవ‌రెవ‌రు ఈ లిస్టులో ఉన్నారో ఓ లుక్కేద్దాం.

– నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు, కాని నాగ్‌ 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చారు. నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

– పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నారు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్నాడు.

– నటుడు శరత్ బాబు మొదటిసారి నటి రామ ప్రభును 1981 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1988 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

– ప్రకాష్ రాజ్ 1994 లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. ఈ జంట 2009 లో విడాకులు తీసుకున్నారు మరియు ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను 2010 లో వివాహం చేసుకున్నారు.

– సుమంత్, కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుని ఆమె అమెరికాలో సెటిల్ అయ్యింది.  సుమంత్ మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

– దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ 2014లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈయన కనిక థిల్లాన్‌ అనే సినీ రచయిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయినట్టు తెలిపారు.

– తాజాగా మరొక జంట ఈ జాబితా లోకి చేరా మోహన్ బాబు చిన్న కొడుకు. మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు.పెళ్లై అయిన మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు.

– ఇంకా ఈ లిస్టులో సీనియ‌ర్ హీరోయిన్ శార‌ద‌, విల‌న్ ర‌ఘుబాబు, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news