తెలుగు సినిమా నిర్మాతల కొత్త కష్టాలు తీరేనా..!!

-

ఇప్పటికే అనేక సమస్యలతో సతమత అవుతున్న టాలీవుడ్ కు మరో సమస్య వచ్చిందా అంటే అవునని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో తెలుగు నిర్మాతలు స్వయంగా డబ్బులు పెట్టుబడి పెట్టేవారు. దానితో వారు దగ్గరుండి మరీ చూసుకుంటూ సినిమా నిర్మాణం పూర్తి చేసేవారు. ఇక తర్వాత  నుంచి ఎక్కువ సినిమాలు ఫైనాన్స్ మీద ఆధార పడుకుంటూ వచ్చాయి. అదే ఇప్పడు టాలీవుడ్ కు అతి పెద్ద సమస్య కాబోతోంది.

ఇన్నాళ్లూ ఫైనాన్స్ అంటే నిర్మాతలకు పెద్దగా సమస్య కాదు. బడా ఫైనాన్సియర్ల దగ్గర నుంచి చిన్నచిన్న వారి వరకు సినిమా నిర్మాణాలకు అప్పులు ఇవ్వడానికి రెడీగా వుండేవారు. అలాగే కొందరు మీడియా బాసు లు కూడా ఫైనాన్స్ ఇచ్చేవారు.అలాగే  రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ లో డబ్బులు వచ్చిన వారు కూడా పెట్టుబడి పెట్టేవారు.

లైగర్ సినిమా వల్ల తెలుగు సినిమా పరిశ్రమ లో  నమ్మకం పోయింది. ఒకే సారి అంత నష్టాలు వచ్చి వాళ్లు చేతులు ఎత్తివేయడం వంటివి జరుగు తున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసి, ఫైనాన్సియర్స్ నమ్మకం వున్న ఒకరిద్దరు నిర్మాతలకు మాత్రమే ఇస్తున్నారు . సినిమా ఫైనాన్స్ నిలిపివేసామని ఈ ఇద్దరు బడా ఫైనాన్సియర్లు చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా  మార్గాలు వెదుక్కోవాల్సి వుంటుంది. ఇప్పుడు అంతకు ముందు లాగా కాంట్రాక్టర్స్, రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్ళను అంత నమ్మడం లేదు. ఈ ఫైనాన్స్ కష్టాలను నిర్మాత లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version